- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న మిర్నా మీనన్.. యాక్షన్ హీరో సరసన చాన్స్!
యాక్షన్ హీరో అరుణ్ విజయ్ నటిస్తున్న సరికొత్త మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మిర్నా మీనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.

దిశ సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ మిర్నా మీనన్ ప్రస్తుతం హీరోయిన్‌గా, వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తూ.. ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘జైలర్’ లో ఆయన కోడలి పాత్రలో నటించి మిర్నా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమా సాధించిన భారీ విజయం ఆమె కెరీర్‌కు ప్లస్ అయిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘జైలర్-2’ లో కూడా మిర్నా మీనన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో బంపర్ ఆఫర్ వచ్చి చేరినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.
యాక్షన్ హీరో అరుణ్ విజయ్ నటిస్తున్న సరికొత్త మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మిర్నా మీనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. వైవిధ్యమైన విలేజ్ డ్రామాలు, కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన ప్రముఖ దర్శకుడు ముత్తయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర యూనిట్‌తో మిర్నా మీనన్ కూడా కలవబోతున్నట్లు తెలుస్తోంది. ముత్తయ్య సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కేవలం గ్లామర్‌కే కాకుండా నటనకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ సినిమాలో మిర్నాకు ఒక పవర్‌ఫుల్ రోల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






