గొల్లపాడులో కలకలం.. ఐపీ బాధితుల ఆత్మహత్యాయత్నం

by Jakkula.Mamatha |

రూరల్ మండలం గొల్లపాడు గ్రామంలో ఐపీ వ్యవహారం కలకలం రేపుతోంది.

గొల్లపాడులో కలకలం.. ఐపీ బాధితుల ఆత్మహత్యాయత్నం
X

దిశ,ఖమ్మం రూరల్: రూరల్ మండలం గొల్లపాడు గ్రామంలో ఐపీ వ్యవహారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రుద్ర దేవేందర్ ఖమ్మం కోర్టులో రూ.1.13 కోట్లకు ఐపీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవేందర్‌కు అప్పుగా లక్షల రూపాయలు ఇచ్చిన ముగ్గురు బాధితులు శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన సైదులు ద్వారా మందడి స్వరూప, కొత్త నాగమణిలు దేవేందర్‌కు నగదు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. ఐపీ దాఖలు చేసిన విషయం తెలుసుకున్న స్వరూప, నాగమణిలు శుక్రవారం ఉదయం సైదులు ఇంటికి వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సైదులు పురుగుల మందు తాగాడు. అది చూసిన స్వరూప, నాగమణిలు కూడా అదే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story