- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకీ మాస్టర్ ప్లాన్.. రెండు మెయిన్ సీజన్లు టార్గెట్
వెంకటేష్ వరుసగా దసరా, సంక్రాంతి వంటి రెండు ప్రధాన సీజన్లలో తన సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో సీనియర్‌ల నుంచి జూనియర్ స్టార్ హీరోల వరకు ఒక్కో సినిమాకు ఒకటి, రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విక్టరీ వెంకటేష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్‌గా వచ్చే రెండు ప్రధాన సీజన్లలో తన సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం చిత్రాలు సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లలోనే విడుదలవుతుంటాయి. ఈ సమయంలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడంతో స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను ఈ సీజన్లలో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవల ఒక సీజన్‌లో సినిమా విడుదల చేసిన హీరో, మరో సీజన్‌లో కనిపించడం అరుదుగా మారింది.
కానీ వెంకటేష్ మాత్రం వరుసగా రెండు ప్రధాన సీజన్లను టార్గెట్ చేశాడు. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే 'ఆదర్శ కుటుంబం' చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో వెంకటేష్ వరుసగా దసరా, సంక్రాంతి వంటి రెండు ప్రధాన సీజన్లను టార్గెట్ చేసినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలతో వెంకీ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.






