సముద్రతీరంలో మత్తెక్కించే అందాలతో మెరిసిన మాళవిక మోహనన్

by Pulgam srinivas |   (  Updated:2026-07-03 07:05:19  IST  )

సముద్ర తీరంలో మాళవిక మోహనన్ గ్లామర్ షో.

సముద్రతీరంలో మత్తెక్కించే అందాలతో మెరిసిన మాళవిక మోహనన్
X

దిశ, వెబ్ డెస్క్: మాళవిక మోహనన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ్, మలయాళం, హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఆమె మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.యూ. మోహనన్ కుమార్తె అయిన మాళవిక, 2013లో విడుదలైన మలయాళ చిత్రం 'పట్టం పోల్' ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం రజనీకాంత్ హీరోగా నటించిన 'పెట్టా', విజయ్ హీరోగా తెరకెక్కిన 'మాస్టర్' చిత్రాలతో విశేష గుర్తింపు తెచ్చుకుంది.

ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'ది రాజా సాబ్' చిత్రంలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకునే మాళవిక సోషల్ మీడియాలోనూ అదే జోరును కొనసాగిస్తోంది.

తాజాగా సముద్ర తీరంలో స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. విభిన్న యాంగిల్స్‌లో ఇచ్చిన పోజులు ఆమె లుక్‌ను మరింత ఆకర్షణీయంగా నిలిపాయి.

ముఖంపై అందంగా జారిన కురులు, చేతికి ధరించిన గాజులు, ట్రెండీ స్టైలింగ్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల నుంచి విశేష స్పందనను అందుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story