ఖబడ్దార్..! ఇష్టానుసారంగా మాట్లాడొద్దు: హరీశ్ రావు, KTRలకు మంత్రి జూపల్లి వార్నింగ్

by Kema Shiva Kumar |

తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య తీవ్రస్థాయిలో సవాళ్ల పర్వం నడుస్తోంది.

ఖబడ్దార్..! ఇష్టానుసారంగా మాట్లాడొద్దు: హరీశ్ రావు, KTRలకు మంత్రి జూపల్లి వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పుల వివరాలపై సమగ్ర చర్చకు తాను సిద్ధంగా ఉన్నాయని మరోసారి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లకు సవాలు విసిరారు. ఇవాళ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7.3 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే స్పేషల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూ.74 వేల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. అప్పులపై తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని,. తాము అప్పులు చేయలేదని కేసీఆర్‌ చెప్పాలన్నారు. ఒకవేళ తాను చెప్పింది అబద్ధమైతే ఈ క్షణమే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రటించారు.

రాజీనామాకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నా..

ఇదే కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) గతంలో రాష్ట్ర అప్పులపై వేర్వేలు లెక్కలు చెప్పారని ఫైర్ అయ్యారు. అందుకు సంబంధించి వివరాలను వాళ్లకు వాట్సాప్‌ ద్వారా పంపుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ తీరు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న చందంగా ఉందని సెటైర్లు వేశారు. ముందు తాను చెబుతున్న లెక్కలు తప్పు అని కేసీఆర్‌‌తో చెప్పించండి చూద్దాం అని గరం అయ్యారు.

సిగ్గులేని మాటలు.. నేను మాట్లాడను

‘నేను సవాల్ చేసి పారిపోయానని.. కేటీఆర్, హరీశ్ రావు ఆరోపిస్తున్నారని, రాజీనామా సవాలుపై ఇప్పటికే కట్టుబడి ఉన్నా..రండి’ ధ్వజమెత్తారు. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ప్రెస్‌క్లబ్ చర్చిద్దామని జూపల్లి సవాలు విసిరారు. ముఖ్యంగా రాష్ట్ర అప్పులపై కేటీఆర్, హరీశ్ రావు చెప్పింది తప్పని తేలితే ఎమ్మెల్యే పదవులకు, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ముందు తన చరిత్ర ఏంటో తెలుసుకోవాలని, వాళ్ల లాగా సిగ్గులేని మాటలు మాట్లాడనని.. ఖబడ్దార్ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు.


Next Story