తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. ఉత్తర జిల్లాల్లో ‘ముసురు వానలు’

by Malleboina Mahesh |

తెలంగాణలో జూలై 3-5 వరకు ఉత్తర జిల్లాల్లో ముసురు వానలు, హైదరాబాద్‌లో సాయంత్రం వేళల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ అలర్ట్ జారీ చేశారు.

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. ఉత్తర జిల్లాల్లో ‘ముసురు వానలు’
X

దిశ, వెబ్ డెస్క్: జూన్ నెల గడిచిన సరైన వానలు లేక.. ఎండలు, వడగాల్పులతో వర్షాల (rains) కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weatherman) చల్లని కబురు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (LPA) ప్రభావంతో నేటి (జూలై 3) నుండి జూలై 5వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ సీజన్‌లోనే మొదటిసారిగా సుదీర్ఘంగా సాగే ‘ముసురు వానలు’ (Continuous Rains) ప్రారంభం కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా వెదర్ మ్యాన్ రిపోర్టు సూచించింది.

పింక్ అలర్ట్ జారీ అయిన ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రోజుకు 100 నుండి 120 మి.మీ వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రెడ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు రోజుకు 50 నుంచి 80 మి.మీ వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యస్థ వర్షాలు (బ్లూ అలర్ట్ జిల్లాల్లో) ఈ ప్రాంతాల్లో రోజుకు 15 నుంచి 45 మి.మీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో 10 నుంచి 15 మి.మీ వరకు తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది.

హైదరాబాద్ లో వర్షాల పరిస్థితి ఏమిటంటే..?

తాజా అలర్ట్ ప్రకారం భాగ్యనగరంలో రాబోయే మూడు రోజుల పాటు ఆకాశం పూర్తిగా మేఘావృతమై (Overcast Conditions) ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశం ఉండగా.. సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో నగరవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఎండిపోతున్న పంటలకు, అడుగంటుతున్న భూగర్భ జలాలకు ఎంతో ఊరటనిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

Next Story