అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ అధికారుల పంజా.. 5 ట్రాక్టర్లు, జేసీబీ స్వాధీనం

by Jakkula.Mamatha |

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని రోళ్లకల్లు గ్రామ శివారులో భారీగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు.

అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ అధికారుల పంజా.. 5 ట్రాక్టర్లు, జేసీబీ స్వాధీనం
X

దిశ, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని రోళ్లకల్లు గ్రామ శివారులో భారీగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్న ముఠా పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 5 ట్రాక్టర్లతో పాటు, లోడింగ్‌కు ఉపయోగిస్తున్న ఒక ఎస్కవేటర్(జేసీబీ)ను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలతో పాటు నలుగురు డ్రైవర్లను స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, నిబంధనలను ఉల్లంఘించిన నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు. మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణా, మైనింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సై ప్రవీణ్ హెచ్చరించారు.

Next Story