- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొరపాట్లు జరగకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి : ఎమ్మెల్యే
ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎస్ఐఆర్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బిఎల్ఓ కు సూచించారు.

దిశ, నర్సాపూర్: ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎస్ఐఆర్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బిఎల్ఓ కు సూచించారు. నర్సాపూర్ పట్టణంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓతో మాట్లాడి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, నమోదవుతున్న వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్, బాల్‌రెడ్డి, నాగరాజు, మహ్మద్, రింగుల ప్రసాద్, హైమద్, ఆనంద్, జాన్, అక్రమ్, హయాన్, ఇమ్రాన్, మైపాల్ రెడ్డి, వినయ్, జిపిఓ దుర్గయ్య, బీఎల్ఓ వనజ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






