- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
by Jakkula.Mamatha |
రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, ఘట్కేసర్: రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట చెందిన దంపతులు రవికుమార్, శిరీష దంపతులు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో నివాసముంటున్నారు. గురువారం రాత్రి ఘట్‌కేసర్ నుంచి బీబీనగర్ వైపు వెళ్లే రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్‌సీ సమీపంలో రైలు కిందపడి రవికుమార్, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






