- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: ట్రైన్‌లో ‘హనీమూన్’ ప్లాన్ చేసిన క్రేజీ కపుల్.. పాపం టీటీఈ ఫ్యూజులు అవుట్ (వీడియో)
నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ ఏసీ క్యాబిన్ ఉన్నట్టుడి ‘హనీమూన్ సూట్’గా మారిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: ట్రైన్ జర్నీలో ఓ కొత్త జంట చేసిన వింత పని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారడంతో పాటు.. ఏకంగా ఓ రైల్వే ఉద్యోగి ఉద్యోగానికే ఎసరు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ (Nandigram Expres)లో ప్రయాణిస్తున్న కొత్తగా పెళ్లైన యువ జంట తాము బుక్ చేసుకున్న ఫస్ట్ ఏసీ క్యాబిన్‌ను ఏకంగా హనీమూన్ సూట్ (Honeymoon Suite) మార్చేసింది. తమ ప్రయాణాన్ని మరింత రోమాంటిక్‌గా మార్చుకోవడం కోసం ఆన్‌లైన్‌లో ప్రైవేట్ డెకరేషన్ ఏజెన్సీని ఆశ్రయించింది. రైలు కదులుతున్న సమయంలోనే ఆ డెకరేటర్లు ఫస్ట్ ఏసీ కూపేలోకి ప్రవేశించి.. లోపల అంతా ఎర్రటి గులాబీలు, హార్ట్ షేప్ బెలూన్లు, ‘ఐ లవ్ యూ’ అని రాసి ఉన్న అక్షరాలతో లగ్జరీ హోటల్ రూమ్‌లా అలంకరించారు. ప్రస్తుతం ఆ ఫస్ట్ ఏసీ ‘హనీమూన్ సూట్’ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే, ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ట్రైన్ క్యాబిన్‌ను ఇలా ప్రైవేట్‌గా అలంకరించుకోవడం నిబంధనలకు విరుద్ధం. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, ప్రైవేటు వ్యక్తులను లోపలికి అనుమతించినందుకు సహరించిన సదరు టీటీఈ (TTE)ని తక్షణమే సస్పెండ్ చేస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.






