- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
H-1B వీసా మోసాలపై ఉక్కుపాదం.. భారతీయులకు బిగ్ షాకిచ్చిన జేడీ వాన్స్
H-1B వీసా మోసాలపై అమెరికా ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫారిన్ ఐటీ ఎక్స్‌పర్ట్స్, ముఖ్యంగా భారతీయ టెక్కీలు ఎంతగానో ఆధారపడే అత్యంత ప్రజాదరణ పొందిన H-1B వీసాల దుర్వినియోగంపై అమెరికా ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. H-1B వీసా ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, మోసాలపై యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) సమగ్ర దర్యాప్తును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ (JD Vance) మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న ఉద్యోగాలు మొదటి ప్రాధాన్యతగా అమెరికా పౌరులతో దక్కాలని అన్నారు. వీసా నిబంధనలను తుంగలో తొక్కి, తక్కువ జీతాలకే విదేశీయులను అమెరికాకు తెచ్చుకునేందుకు కొన్ని కంపెనీలు చేస్తున్న మోసాలను ఇక నుంచి అసలు సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. H-1B వీసా వ్యవస్థలోని లూప్‌హోల్స్‌ను వాడుకుని ఫేక్ డాక్యుమెంట్లతో మోసాలకు పాల్పడుతున్న ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీల ఆట కట్టిస్తామని జేడీ వాన్స్ హెచ్చరించారు.
కాగా, కొన్ని సంస్థలు ఒకే అభ్యర్థి పేరుతో మల్టిపుల్ అప్లికేషన్ సమర్పించి లాటరీ H-1B గెలిచే అవకాశాలను మెరుగుపరచుకుంటున్నట్లుగా దర్యాప్తులో తేలిందని USCIS అధికారులు పేర్కొన్నారు. తాజా దర్యాప్తుతో నిబంధనలు ఉల్లంఘించిన అన్ని కంపెనీలపై కఠినమైన జరిమానాలు విధించడంతో పాటు, వీసాలను రద్దు చేసే అవకాశం ఉండటంతో అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ రంగ నిపుణులలో ఆందోళన మొదలైంది.






