- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను చంపి తాను ఆత్మహత్య..
కారణాలు స్పష్టంగా వెలుగులోకి రానప్పటికీ భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో జరిగింది.

దిశ, తుంగతుర్తి: కారణాలు స్పష్టంగా వెలుగులోకి రానప్పటికీ భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కోట సత్యనారాయణ (55) కనకమహాలక్ష్మి (50) ఇరువురు దంపతులు.. వీరికి ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె కూడా సంతానం. అందరికీ వివాహమై వివిధ ప్రాంతాలలో స్థిరపడగా వీరిద్దరే స్వగ్రామంలో ఉంటూ గ్రామ గ్రామాన తిరుగుతూ చిరు వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు. అయితే గురువారం పొద్దెక్కాక కూడా తలుపులు తీయలేదు. పలువురు తలుపులను కొట్టి శబ్దం చేసిన ఉలుకు లేదు పలుకు లేదు. చివరికి పక్కనే ఉన్న కిటికీ గుండా చూసిన వారికి మిగతా జీవులుగా కనిపించారు. సత్యనారాయణ దూలం కర్రకు ఉరి పెట్టుకోగా నేలపై కనకమహాలక్ష్మి రక్తం మడుగులో కనిపించారు. కాగా దంపతుల మధ్య ఈ మధ్యకాలంలో తరచుగా గొడవలు జరుగుతున్నట్లు గ్రామంలో గ్రామంలో ప్రచారం జరుగుతోంది.అయితే భార్య హత్యకు ముందు సత్యనారాయణ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. సర్పంచ్ మంజుల వెంకన్న ద్వారా పోలీసులకు సమాచారం చేరింది. సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, తుంగతుర్తి సీఐ ఉపేందర్ రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై క్రాంతి కుమార్ విచారణ చేపట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.






