పైలాన్ కాలనీలో సీసీ రోడ్ల ధ్వంసంపై బీజేపీ ఆందోళన

by Kodari Anjali |

నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీలో తాగునీటి పైప్‌లైన్ పనుల పేరుతో సీసీ రోడ్లను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎర్రబోయిన రాజు ఆరోపించారు.

పైలాన్ కాలనీలో సీసీ రోడ్ల ధ్వంసంపై బీజేపీ ఆందోళన
X

దిశ, నాగార్జునసాగర్: నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీలో తాగునీటి పైప్‌లైన్ పనుల పేరుతో సీసీ రోడ్లను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎర్రబోయిన రాజు ఆరోపించారు. పైప్‌లైన్‌ల కోసం తవ్విన గుంతలను పనులు పూర్తయిన తర్వాత కూడా పూడ్చివేయకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో ఈ గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి తవ్విన గుంతలను పూడ్చివేయడంతో పాటు ధ్వంసమైన సీసీ రోడ్లను పునరుద్ధరించాలని ఎర్రబోయిన రాజు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Next Story