గత ప్రభుత్వం ప్రజలకు శాపం.. పాస్‌ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు

by Ramesh Naini |

గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

గత ప్రభుత్వం ప్రజలకు శాపం.. పాస్‌ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గత పాలకుల ఆరాచకాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతులకు నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తులపై పూర్తి హక్కు వారిదేనని, దానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివాదాస్పద ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ను తక్షణమే రద్దు చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్‌పుస్తకాలపై నాయకుల ఫోటోలు ముద్రించడంతో పాటు భూముల్లో ఏర్పాటు చేసిన రాళ్లపై కూడా వారి పేర్లు ఉండేవని చంద్రబాబు విమర్శించారు. అలాంటి విధానాలకు తమ ప్రభుత్వం ముగింపు పలికిందని పేర్కొన్నారు. రైతుల భూ హక్కులను పరిరక్షించడంతో పాటు పారదర్శకమైన భూ పరిపాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.

Next Story