వంకులంలో ఎస్‌ఐఆర్ సర్వేను సమీక్షించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్

by Kodari Anjali |

రెబ్బెన మండలంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ సర్వే పురోగతిని గురువారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జాసింత్ జోయల్ సమీక్షించారు.

వంకులంలో ఎస్‌ఐఆర్ సర్వేను సమీక్షించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్
X

దిశ, రెబ్బెన: రెబ్బెన మండలంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ సర్వే పురోగతిని గురువారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జాసింత్ జోయల్ సమీక్షించారు. స్థానిక తహసీల్దార్ సూర్యప్రకాశ్తో కలిసి వంకులం గ్రామంతో పాటు రెబ్బెన మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి సర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంకులంలో 60 శాతం, రెబ్బెన మండల కేంద్రంలో 52 శాతం ఎస్‌ఐఆర్ సర్వే పూర్తయిందని తెలిపారు. మిగిలిన సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని బీఎల్‌వోలు, వాలంటీర్లు, బీఎల్‌వో సూపర్వైజర్లకు సూచించారు. నిర్దేశించిన గడువులోగా సర్వేను పూర్తి చేసి ప్రతి అర్హుడి వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సర్వే నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, బీఎల్‌వో సూపర్వైజర్ సౌమ్య, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌వోలు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Next Story