- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని నిరుద్యోగులకు అలర్ట్.. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌పై బిగ్ అప్‌డేట్
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌పై మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు రానేవచ్చింది. ఇటీవల పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) కసరత్తు పూర్తి చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసింది. అయితే, తాజాగా ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పంపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి అధికారిక ముద్ర పడగానే వచ్చే వారంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు అధికారులు అన్న ఏర్పాట్లు చేశారు.
తాజాగా, వెలువడబోయే నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7,437 పోస్టులలో వివిధ విభాగాలను భర్తీ చేయనున్నారు. అందులో ఫైర్ డిపార్ట్‌మెంట్ 790 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1,424 పోస్టులు, జైళ్ల శాఖలో 223 పోస్టులు, పోలీస్ శాఖలోని ఇతర విభాగాల్లో 5 వేల పోస్టులు ఉన్నాయి. ఆర్థిక శాఖ అనుమతితో పాటు రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉండటంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






