- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంబోతులు.. అడ్డగాడిదల్లా అడ్డుకుంటారా?.. కేటీఆర్, హరీశ్ రావుపై కవిత ఘాటు విమర్శలు
బీఆర్ఎస్ సోషల్ మీడియా అతి చేస్తే కాళ్లు విరగ్గొడతామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ప్రజా సమస్యలపై పోరాటంలో మాతో పోటీ పడాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చాలెంజ్ చేశారు. నేను పార్టీ పెట్టుకుంటే ఎలాంటి భయం లేదని చెప్పిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఎందుకు చాటుమాటుగా ఈసీకి ఫిర్యాదులు చేస్తోందని ప్రశ్నించారు. మా పార్టీకి సంబంధించిన న్యూస్ కవరేజ్ చేస్తున్న పత్రికలు, టీవీలకు హరీశ్ రావు, కేటీఆర్ ఫోన్ చేసి అడ్డుకుంటున్నారని ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకని నిలదీశారు. ఓ ఆడబిడ్డగా ప్రజల మధ్యకు నేను ధైర్యం వెళ్తుంటే ఆంబోతుల్లా.. అడ్డగాడిదల్లా నా కాళ్లలో ఎందుకు కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన కవిత.. ఏనాటికైనా నేను తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తానని చాటుమాటుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారని కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్‍లో నేను కలిసేది లేదు ఆ పార్టీతో జతకట్టేదే లేదని స్పష్టం చేశారు.
పార్టీ పేరు ఏదైనా ప్రజల ఆశీర్వాదం ఉండాలి:
మా పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన అని మేము పెట్టుకున్నది కాదని ఈసీ మాకు పంపిన ఐదు పేర్లలో వచ్చిందేనన్నారు. ఈ పేరును పోగొట్టేందుకు బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. అయితే దేవుడు, న్యాయం నా పక్షాన ఉందని అంతిమంగా విజయం నాదే అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ పేరు వచ్చినా ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. నేను అడిగి ప్రశ్నలకు నేను కేటీఆర్, హరీశ్ రావుపై చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పలేని ప్రశ్నించారు. తల్లీ, చెల్లి అనే సంస్కారం లేకుండా అడ్డమైన కామెంట్స్ చేస్తే చూస్తూఊరుకోమని బీఆర్ఎస్ సోషల్ మీడియాను హెచ్చరించారు. దమ్ముంటే ముఖం చూయించి మాట్లాడాలని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఉన్నది ఎవరో తమకు తెలుసన్నారు. అతి చేస్తే కాళ్లు విరగొడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే కేటీఆర్ రూ.188 కోట్లతో ఓ ఇంగ్లీశ్ న్యూస్ పేపర్ ను కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రజల మెచ్చితే అధికారంలోకి వస్తామని ప్రతిపక్షంలో ఉంటే అధికారం లేదని ఇంట్లో ఉండబోమన్నారు.
ఆ పార్టీ జన్మలో బాగుపడదు:
బీఆర్ఎస్ పార్టీని జోడెద్దుల్లా నడపాల్సిన కేటీఆర్, హరీశ్ రావు దున్నపొతుల్లా ప్రజల సమస్యలను మర్చిపోయి అవినీతి అంశాలు అవినీతి పరులను కాపాడటమే పనిగా పెట్టుకున్నారని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను ఉద్యమాకారుల గురించి మొన్న పోరాటం చేస్తే నన్ను ఆపడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామా చేశారన్నారు. నన్ను ఆపడానికి అవసరం అయితే కాంగ్రెస్, అవసరం అయితే బీజేపీతో జతకట్టడం ఏంటి పార్టీకి ఓ విధానం ఉండదా అని నిలదీశారు. ఎవరి వల్ల అవినీతి జరిగిందో ఆ గుంటనక్కను ముందు పెడుతున్న బీఆర్ఎస్ ఈ జన్మలో బాగుపడదని అధికారంలోకి రాదన్నారు. కేసీఆర్‍కు అవినీతి మరకలు అంటించింది సరిపోవడం లేదని మరో మూడు నెలలు ఇరిగేషన్ మంత్రి అడుగుతున్నావా అని హరీశ్ రావును ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి అవినీతి మరక అంటడానికి, కాళేశ్వరంలోపూర్తిగా అవినీతికి కారణం హరీశ్ రావు అని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఖాతాలో అవినీతి సొమ్ము:
బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలోఉన్న రూ.1400 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని ఆ నిధులపై విచారణ జరిపి ఉద్యమకారులు, అమలవీరుల కుటుంబాలకు పంచాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజల ఆస్తి రూ. 800 కోట్లు ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది కేటీఆర్, హరీశ్ రావు కాదా అని నిలదీశారు. ఎవడు వాడు ఫీనిక్స్ వాడు.. తెలంగాణోడా.. ఆంధ్రోడా? ఎందుకని అతనికి తెలంగాణ భూములను అతనికి పంచిపెడుతున్నారు. బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం డోర్లు తెరిచి అదే అవినీతి కొనసాగిస్తోందన్నారు. జాతీయ పార్టీలకు తెలంగాణ, ఆంధ్ర అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుంది? తెలంగాణ భూములు కాపాడాలనే ఆలోచన ఆ పార్టీలకు ఎందుకు ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 33 లక్షల టన్నుల కలపను ఫీనిక్స్ సంస్థ కొట్టేస్తే కేవలం 10 కేసులు పెట్టి ఊరుకున్నారన్నారు. మేము అధికారంలోకి వచ్చాక కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఇచ్చిన తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం, ధార్మిక భూములన్నీంటిపై రివ్యూ చేసి కక్కిస్తామన్నారు.
ఈనెల 20 నుంచి రామగుండంలో నిరవధిక దీక్ష:
సింగరేణి బాయి బాటలో భాగంగా కార్మికులతో మమేకమవుతున్నట్లు కవిత చెప్పారు. సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యాజమాన్యం దృష్టి సారించాలన్నారు. తెలంగాణ హక్కుగా ఉన్న బొగ్గు బ్లాక్‌లు కేంద్రంలోని బీజేపీ వైఖరి వల్ల ప్రైవేట్‌పరం అవుతున్నాయని కవిత విమర్శించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం డిపెండెంట్లపై స్పష్టత ఇవ్వకపోతే ఈనెల 20 నుంచి రామగుండంలో నిరవధిక దీక్ష చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.






