- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజన్న ఆలయ డిప్యూటీ ఈఓగా నవీన్‌కుమార్ బాధ్యతల స్వీకారం..
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డి.ఈ.ఓ)గా ప్రతాప నవీన్ కుమార్ బాధ్యతలు స్వీకరించాడు.

దిశ, వేములవాడ: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డి.ఈ.ఓ)గా ప్రతాప నవీన్ కుమార్ బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో డి.ఈ.ఓగా విధులు నిర్వర్తిస్తున్న నవీన్ కుమార్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు తిరిగి తన మాతృ సంస్థ అయిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి బదిలీపై వచ్చి, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈ.ఓ) ఎల్. రమాదేవి ఆదేశాల మేరకు గురువారం బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న నవీన్ కుమార్ శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదం, స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం డిప్యూటీ ఈ.ఓ కార్యాలయ చాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన నవీన్ కుమార్ ను ఆలయ ఉద్యోగుల సంఘం తరఫున శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగుల సంఘ నాయకులు, ఆలయ అధికారులు, ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.






