తండాలో అరుదైన ఘటన.. ఉపాధ్యాయుడితో కలిసి డిప్యుటేషన్!

by Kodari Anjali |

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

తండాలో అరుదైన ఘటన..  ఉపాధ్యాయుడితో కలిసి డిప్యుటేషన్!
X

దిశ, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి రితీశ్ మాత్రమే మిగలడంతో, ఆ విద్యార్థిని హెడ్మాస్టర్ శ్రీనివాస్‌తో కలిసి సమీపంలోని కల్వల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు డిప్యుటేషన్‌పై తరలించినట్లు సమాచారం. దీంతో క్యాంపు తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం పడింది. విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నప్పటికీ, విద్యా హక్కు చట్టం (RTE) స్ఫూర్తికి విరుద్ధంగా పాఠశాలను మూసివేశారని పలువురు విమర్శిస్తున్నారు. మారుమూల తండాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన సమయంలో, ఉన్న ఒక్క విద్యార్థినే మరో పాఠశాలకు తరలించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి, తగిన వివరణ ఇవ్వాలని గ్రామస్థులు, విద్యా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

Next Story