సెన్సార్ పూర్తి చేసుకున్న 'లెనిన్'

by Pulgam srinivas |

'లెనిన్' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి 'U/A' సర్టిఫికెట్ లభించింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న లెనిన్
X

దిశ, వెబ్‌ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను మేకర్స్ తాజాగా పూర్తి చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాల ద్వారా ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు, రక్తపాతంతో కూడిన ఎపిసోడ్‌లు ఉండనున్నట్లు ఇప్పటికే సంకేతాలు లభించాయి.

ఇప్పుడు 'U/A' సర్టిఫికెట్ రావడంతో ఈ చిత్రంలో యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. బ్రహ్మాజీ, శివాజీ, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే 'లెనిన్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరో కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.




Next Story