దుల్కర్ సల్మాన్ 'DQ41' టైటిల్.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్-టైమ్ లాక్

by Pulgam srinivas |

దుల్కర్ సల్మాన్ 'DQ41' టైటిల్, ఫస్ట్ లుక్‌ను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దుల్కర్ సల్మాన్ DQ41 టైటిల్.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్-టైమ్ లాక్
X

దిశ, వెబ్‌ డెస్క్: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన 'DQ41' సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రత్యేక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. విడుదల చేసిన పోస్టర్‌లో సగం పచ్చగా, సగం ఎండిపోయిన చెట్టు, పక్షుల గూడు, ఆకాశం వంటి విజువల్ ఎలిమెంట్స్‌తో పాటు #LoveWillSparkAgain అనే ట్యాగ్‌లైన్‌ను జోడించడం ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లోని విజువల్స్‌ను బట్టి ఇది ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో సాగే కథగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సినిమా టైటిల్ ఏమిటి? ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా రవి నేలకూటి దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.




Next Story