- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : పొట్ట పెరుగుతోందని, శరీరంలో కొవ్వు పేరుకుపోతోందని బాధపడుతున్నారా? అయితే డైలీ 3 నిమిషాలపాటు 15 రోజులపాటు ప్లాంక్స్ వ్యాయామం చేయండి అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఇది కొవ్వును కరిగించడంలో అద్భుతంగా సహాయపడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఉదరం, వీపు, భుజాలు వంటి కోర్ కండరాలను బలోపేతం చేయడం ద్వారా మొత్తం ఆరోగ్య శ్రయేస్సుకు దోహదపడుతుంది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్లాంక్స్ (Planks) అనేది ఎలాంటి పరికరాలు లేకుండా కేవలం శరీర బరువుతో చేసే అత్యంత ప్రభావవంతమైన కోర్ (Core) ఎక్సర్‌సైజ్. పుష్-అప్ (Push-up) పొజిషన్‌లో ఉండి.. తల నుండి మడమల వరకు శరీరాన్ని ఒకే సరళరేఖలో (ప్లాంక్ లేదా చెక్కబల్లా మాదిరి) గట్టిగా బిగించి పట్టుకోవడం ఇందులో ప్రధాన భాగం. అంతేకాకుండా ఈ భంగిమ (పోస్చర్) వెన్నునొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. కండరాల ఓర్పును (ఎండ్యూరెన్స్) పెంచుతుంది. రోజూ సరైన రీతిలో ప్లాంక్ చేయడం వల్ల శరీర స్థిరత్వం పెరుగుతుంది. అయితే.. కేవలం 15 రోజులు డైలీ 3 నిమిషాల ప్లాంక్ చేయడం మాత్రమే పొట్ట కొవ్వును పూర్తిగా తగ్గిస్తుందనే అపోహ అవసరం లేదు. ఇలా చేయడంతోపాటు ప్రోటీన్లు కలిగిన సమతుల్య ఆహారం, కార్డియో వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటివి కూడా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడతాయని ఫిట్‌నెస్& హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






