- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ సంబంధాలతో పిల్లల జీవితాలు ఆగం..
వ్యామోహంతో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.

దిశ, హుజూర్ నగర్ టౌన్: మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా వ్యామోహానికి అలవాటు పడి భార్యలు భర్తలని, భర్తలు భార్యలని చంపటం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో చిన్నారులపై కర్కషత్తుంగా వివరించిన తీరు ప్రజలను విస్మయానికి గురిచేసింది. పట్టణంలోని ఎన్ ఎస్పీ క్యాంపుకు చెందిన నకిరేకంటి రవి ఇందులకు ఇద్దరికీ గతంలో వేర్వేరు వివాహాలు అయ్యాయి. వారిద్దరికీ మొదటి సంబంధంలో చెరొక కుమారుడు ఉన్నారు. ఇందు గతంలో తన భర్తతో కలిసి ఉన్నప్పుడు వారికీ ఒక కుమారుడు ధనుష్ ఉన్నాడు. కాగా వీరు నిత్యం కూలీ పనులకు వెళ్తూ.. జీవనం సాగించేవారు. అలా కూలీ పనులకు వెళ్తున్న సమయంలో ఇందుకి నకిరేకంటి రవి పరిచయమయ్యాడు. రవికి కూడా గతంలో వివాహం కావడంతో అతనికి ఒక కుమారుడు రేవంత్ ఉన్నాడు. ప్రతిరోజు కూలీ పనులకు వెళ్లే వీరు ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో వీరిరువూరికి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇందు తన భర్తని, రవి తన భార్యని వదిలేశారు. కానీ వీరిరువూరు తమ కుమారులను తమ వద్దే ఉంచుకుంటున్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డు అని..
వివాహేతర సంబంధంతో కలిసిపోయిన నకిరేకంటి రవి ఇందు కలిసి వివాహం చేసుకున్నారు. అనంతరం వీరిరువూరు యధావిధిగా కూలీ పనులకు వెళ్లసాగారు. అలా కూలి పనులకు వెళ్తున్న వీరికి సక్రమంగా కూలీ పనులు దొరకకపోవడంతో పాటు మొదటి సంబంధం కుమారులు వీరికి భారంగా మారారు. దాంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అంతేకాకుండా వివాహేతర సంబంధానికి ఆ చిన్నారులు అడ్డుగా ఉన్నారని, ఆ చిన్నారులను ఎలాగైనా వదిలించుకోవాలని ఉద్దేశంతో వారిని ఆహారం పెట్టేవారు కాదు. నిత్యం ఆ చిన్నారులను వేదించడంతో పాటు నానా ఇబ్బందులు పెట్టేవారు. ఎటు వెళ్లలేని స్థితిలో ఉన్న చిన్నారులను నిత్యం కాళ్లు చేతులు కట్టేసి కొట్టడంతో పాటు ఇనుప రాడ్ కాల్చి వాతలు పెట్టేవారు.
కన్న పేగుపై కనికరం లేని తల్లిదండ్రులు..
ఈ రోజుల్లో తమకు పుట్టిన పిల్లలకు మంచి చదువుతో పాటు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వారిని అపురూపంగా చూసుకుంటారు. కానీ అందుకు భిన్నంగా మానవ సంబంధాలను మరిచి వివాహేత సంబంధం వ్యామోహంతో భార్యలు భర్తలను, భర్తలు భార్యలను వదిలి వేరువేరు వివాహాలు చేసుకున్నారు. కన్నపేగుపై మమకారంలేని వీరికి వ్యామోహం ముఖ్యమై చిన్నారులు అడ్డుగా ఉన్నారని వీరి వల్లే ఆర్థిక సమస్యలు అనే ఉద్దేశంతో చిన్నారులను కొట్టడం, కాల్చి వాతలు పెట్టడంతో పాటు సరైన ఆహారం పెట్టేవారు కాదు. చిన్నారులను కొట్టిన తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కన్న పేగును మరిచి చిన్నారులను నిత్యం వేధిస్తూ కొట్టడంతో, పాటు కాల్చి వాతలు పెట్టిన తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి కర్కషత్వ తల్లిదండ్రులపై ప్రత్యేక చట్టాలు రూపొందించి తక్షణమే శిక్షించాలని పట్టణ ప్రజలకు కోరారు.






