ముంబై మార్గంలో పలు రైళ్లకు రూట్ మార్పు.. కొన్ని పాక్షిక రద్దు

by Taduka Kalyani |   (  Updated:2026-07-09 09:19:20  IST  )

ఆపరేషనల్ కారణాల దృష్ట్యా ముంబై మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించడంతో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ముంబై మార్గంలో పలు రైళ్లకు రూట్ మార్పు.. కొన్ని పాక్షిక రద్దు
X

దిశ, సికింద్రాబాద్: ఆపరేషనల్ కారణాల దృష్ట్యా ముంబై మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించడంతో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చెన్నై–అహ్మదాబాద్, అహ్మదాబాద్–తిరుచ్చిరాపల్లి, సీఎస్‌ఎంటీ ముంబై–చెన్నై, ఎల్‌టిటి ముంబై–కాకినాడ టౌన్, సీఎస్‌ఎంటీ ముంబై–హైదరాబాద్, రాజ్‌కోట్–సికింద్రాబాద్, సీఎస్‌ఎంటీ ముంబై–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దౌండ్–మన్మాడ్ మార్గం మీదుగా ప్రత్యామ్నాయ రూట్లలో నడపనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా హైదరాబాద్–సీఎస్‌ఎంటీ ముంబై, సీఎస్‌ఎంటీ ముంబై–హైదరాబాద్, హెచ్‌.ఎస్‌.నాందేడ్–పన్వేల్, పన్వేల్–హెచ్‌.ఎస్‌.నాందేడ్, నాగర్‌కోయిల్–ఎల్‌టిటి ముంబై, కేఎస్‌ఆర్ బెంగళూరు–సీఎస్‌ఎంటీ ముంబై, ఎల్‌టిటి ముంబై–నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కొంత దూరం వరకు మాత్రమే నడిపి, మిగిలిన మార్గంలో పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ప్రయాణానికి ముందు తమ రైళ్ల తాజా సమాచారం, సమయాలు, రూట్ మార్పుల వివరాలను అధికారిక రైల్వే వేదికల ద్వారా తెలుసుకుని ప్రయాణించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

Next Story