మంత్రి పదవి కావాలంటే రాజీనామా చెయ్.. కడియం శ్రీహరికి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్!

by Prasad Jukanti |

మంత్రి పదవి కావాలంటే రాజీనామా చెయ్.. కడియం శ్రీహరికి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ముదురుతోంది. పరస్పర విమర్శలతో సిట్యుయేషన్ మరింత పీక్స్ కు చేరుకుంటోంది. తాజాగా కడియం శ్రీహరికి మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదటి నుంచి కడియం శ్రీహరి బుద్ధి ఇలాగే ఉంటుందని గతంలో మంత్రిగా పని చేసిన ఆయన ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నట్లైతే పదవికి రాజీనామా చేసి నోర్మూసుకుని ఇంట్లోనైనా కూర్చోవాలని లేదంటే దమ్ముంటే మళ్లీ గెలిచి మంత్రి పదవి తెచ్చుకోవాలన్నారు. అంతే తప్ప నన్ను బ్లేమ్ చేయాలనుకున్నా జిల్లాను డిస్ట్రబ్ చేయాలనుకున్నా ఊరుకోనని హెచ్చరించారు. తన శాఖకు సంబంధించిన దేవాదాయ అంశాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్షా సమావేశం నిర్వహించడంపై ఇవాళ కొండా సురేఖ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మంత్రి.. శ్రీహరి 40 ఏళ్లు రాజకీయ అనుభవం 15 ఏళ్లు మంత్రి పదవి అనుభం కలిగిన కడియం శ్రీహరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తెలిస్తే తాను చేసింది తప్పు అని ఒప్పుకోవాల్సింది పోయి నాపై ఎదురు దాడికి దిగడం కరెక్ట్ కాదన్నారు. కడియంతో తాడోపేడో తేల్చుకుంటానన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ బిడ్డను కాంగ్రెస్ ఎంపీ చేశారు:

శ్రీహరి తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటూ బిడ్డను మాత్రం కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిపించుకున్నారని నిజంగా ఆయనకు విలువలు ఉంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. గతంలో నేను పార్టీ మారినప్పుడు నా భర్త కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇవ్వకూడదనే ప్రభుత్వం, పార్టీపై మచ్చరాకూడదనే తాను రియాక్ట్ అయ్యానన్నారు. తన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. మీనాక్షి నటరాజన్ కూడా ఈ నెల 14న రాష్ట్రానికి రాబోతున్నానని అప్పుడు మాట్లాడుదామని చెప్పారన్నారు. ఇలాంటివి పార్టీ ప్రతిష్టకు దెబ్బతీస్తాయని అందువల్లే ఆదిలోనే అడ్డుకునేందుకు తాను మాట్లాడుతున్నానన్నారు.

పీఆర్వో మినిట్స్ లోనే ఉంది:

దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించినట్లు ఆయన పీఆర్వో ప్రెస్ కు రిలీజ్ చేసిన మినిట్స్ లోనే స్పష్టంగా పేర్కొన్నారని కొండాసురేఖ ఆరోపించారు. కార్యాలయంలో అధికారులతో గంటన్న సేపు సమీక్ష నిర్వహించి ఆలయాల భూములు కాపాడాలని, ఆలయాలకు డీపీఆర్‍లు సిద్ధం చేసి ఒక నెలరోజుల్లో సమర్పించాలని కమిషనర్‍ను ఆదేశించినట్లు ప్రెస్ కు రిలీజ్ చేశారన్నారు. కమిషనర్ చాంబర్ లో ఇదంతా జరిగి ఉంటే నేను ఎలాంటి అభ్యంతరం చెప్పే దాన్ని కాదు. కానీ మీటింగ్ హాల్‍లో మంత్రి, కమిషనర్ కూల్చునే స్థలంలో ఆయన కూర్చుని ముందు స్టాప్ ను కూర్చొబెట్టుకుని నేను ఆదేశాలు ఇచ్చానని చెబితే ఏ రకమైన సంకేతాలు వెళ్తున్నాయన్నారు. మినిస్టర్ స్థాయిలో రివ్యూ తీసుకునే అర్థం వెళ్తోందనే అభ్యంతరం చెప్పాను తప్ప నేను ఆ కార్యాలయానికి వెళ్లొద్దని అనడం లేదన్నారు. సామాన్య కార్యకర్త కూడా కమిషనర్ వద్దకు కాదు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లొచ్చన్నారు. కమిషనర్‍లో చాంబర్‍లో కాకుండా మీటింగ్ హాల్‍లో రివ్యూ చేసిందే కాకుండా మళ్లీ మామీదే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శ్రీహరి రాకముదు పార్టీలో అంతా సవ్యంగా ఉందని ఆయన రావడంతోనే ఇవ్వన్నీ జరుగుతున్నాయన్నారు.

Next Story