- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డయాబెటిస్ బాధితులకు రక్షణగా విటమిన్ B1.. అధ్యయనాలు చెప్పేది ఇదే..!
విటమిన్ B1,రక్తంలో అధిక చక్కెర వల్ల ఏర్పడే హానికరమైన రసాయనిక ప్రక్రియలను తగ్గించడంలో సహాయపడుతుంది.

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒక్కటి. ఆహార నియమాల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే జర్నల్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్ రీసెర్చ్‌లో పబ్లిషైన అధ్యయనం ప్రకారం.. విటమిన్ B1 కూడా అందుకు సహాయపడే అవకాశం ఉందని తేలింది. ప్రధానంగా థయామిన్ అనే పదార్థంవల్ల అది సాధ్యం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి థయామిన్ (విటమిన్ B1) అనేది ప్రధానంగా ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. ఇది డయాబెటిస్ సంబంధిత సమస్యల నుంచి కూడా కొంతవరకు రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి విటమిన్ బి1(Vitamin B1) థయామిన్, బెన్‌ఫోటియామిన్ (ఫ్యాట్ సాల్యూబుల్ రూపం) గురించి రీసెర్చర్స్ పరిశోధనలు జరిపారు.
కిడ్నీ వైఫల్యానికి అడ్డుకట్ట!
ఒక క్లినికల్ అధ్యయనంలో భాగంగా టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతూ.. కిడ్నీ వైఫల్య ప్రారంభ సమస్య(Microalbuminuria)తో ఉన్నవారికి రోజుకు 300 mg థయామిన్ మూడు నెలల పాటు ఇచ్చారు. ఫలితంగా మూత్రంలో ఆల్బ్యూమిన్ అనే ప్రోటీన్ మోతాదు చాలా వరకు తగ్గింది. కాబట్టి ఇది మూత్రపిండాల వైఫ్యలానికి దారితీసే మొదటివశ సమస్యను అడ్డుకొని ఆరోగ్యన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా బి1 విటమిన్‌లోని బెన్‌ఫోటియామిన్ (300-600 mg రోజుకు) డయాబెటిక్ న్యూరోపతి (నరాల నొప్పి) లక్షణాలను తగ్గించడంలోనూ మంచి ఫలితాలు ఇచ్చింది.
హానికారక రసాయనాలకు చెక్
విటమిన్ బి1 సప్లిమెంట్లు రక్తంలో అధిక చక్కెర వల్ల ఏర్పడే హానికరమైన రసాయనిక ప్రక్రియలను తగ్గించి, నరాలు, రక్తనాళాలను సైతం రక్షిస్తాయని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇవి మొదటిదశ పరిశోధనా ఫలితాలు మాత్రమే. ఇంకా పూర్తిస్థాయిలో ఫలితాలకోసం మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు అంటున్నారు. బ్రౌన్ రైస్, గోధుమ, పప్పులు, మాంసం, చేపలు, నట్స్ వంటి ఆహారాలో విటమిన్ B1 లభిస్తుంది. అయితే డయాబెటిస్ బాధితులు అధ్యయనాల్లో లేదా వైద్య నిపుణులు సూచించిన మోతాదులో మాత్రమే ఈ ఆహారాలు గానీ, సప్లిమెంట్లు గానీ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






