ఇస్రో మరో ఘనత.. గగన్‌యాన్ పారాచూట్ పరీక్ష విజయవంతం

by Ramesh Naini |

భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ కోసం రూపొందించిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.

ఇస్రో మరో ఘనత.. గగన్‌యాన్ పారాచూట్ పరీక్ష విజయవంతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ కోసం రూపొందించిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో ఉన్న ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADRDE) డ్రాప్ జోన్‌లో భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్-76 విమానం నుంచి 2.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఎయిర్‌డ్రాప్ పరీక్ష నిర్వహించారు.

పరీక్షలో డమ్మీ బరువుతో కూడిన పేలోడ్‌ను ప్రధాన పారాచూట్ సురక్షితంగా మందగింపజేసి విజయవంతంగా దిగువకు తీసుకువచ్చింది. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షం నుంచి సముద్రంలో సురక్షితంగా దించేందుకు ఉపయోగించే మొత్తం 10 పారాచూట్ల వ్యవస్థలో ప్రధాన పారాచూట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విజయంతో గగన్‌యాన్ తొలి మానవరహిత జీ-1 (G1) మిషన్‌కు అవసరమైన పారాచూట్ వ్యవస్థ పనితీరు, విశ్వసనీయతపై మరింత విశ్వాసం ఏర్పడిందని ఇస్రో ఈ సందర్భంగా వెల్లడించింది.

Next Story