‘RAPO23’ సినిమాలో సంయుక్త మీనన్.. ఫుల్ బిజీ షెడ్యూల్‌లోనూ రామ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్!

by Mallepaka Hamsa |

నిజానికి ఇన్నాళ్లూ ఈ పాత్ర కోసం నివేదా పేతురాజ్ పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో మూవీ మేకర్స్ సంయుక్త వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

‘RAPO23’ సినిమాలో సంయుక్త మీనన్.. ఫుల్ బిజీ షెడ్యూల్‌లోనూ రామ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారారు. బ్యాక్ టు బ్యాక్ షూటింగులలో పాల్గొంటూ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాకు కూడా కాస్త దూరం అయ్యారు. ప్రస్తుతం ఆమె బెంజ్, స్లమ్ డాగ్, స్వయంభూ వంటి భారీ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీ 'బ్లాక్ గోల్డ్' వంటి విభిన్నమైన ప్రాజెక్ట్‌తో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా, ఈ అమ్మడు ఖాతాలోకి మరో బంపర్ ఆఫర్ వచ్చి చేరినట్లు సమాచారం. ఉస్తాద్ రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించబోతున్న చిత్రం ‘రాపో-23’ లో సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇన్నాళ్లూ ఈ పాత్ర కోసం నివేదా పేతురాజ్ పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో మూవీ మేకర్స్ సంయుక్త వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం ఆమెను సంప్రదించగా, కథ నచ్చడంతో సంయుక్త కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాతో రామ్ పోతినేని నటుడిగానే కాకుండా మొదటిసారి దర్శకుడిగా ఒక సరికొత్త సాహసం చేయబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రాన్ని ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించాలని రామ్ ప్లాన్ చేస్తున్నారట. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, రామ్ అభిమానులు.. సంయుక్త లక్ కారణంగా ఈసారి రామ్ ఖాతాలో గ్యారెంటీగా బ్లాక్‌బస్టర్ హిట్ పడటం ఖాయమని అంటున్నారు.

Next Story