- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Atharvaa: 'గద్దలకొండ గణేష్' తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉండటానికి అదే కారణం
'గద్దలకొండ గణేష్' తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా, కరోనా కారణంగా అవి చేజారిపోయాయని అథర్వా వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు అథర్వా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ డబ్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం వరుణ్ తేజ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గద్దలకొండ గణేష్' చిత్రంలో అథర్వా కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమా ద్వారా ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. దీంతో ఈ సినిమా తర్వాత అథర్వా వరుసగా తెలుగు సినిమాలు చేస్తారని చాలామంది భావించారు. అయితే, ఈ చిత్రం విడుదలై ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆయన మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. తాజాగా అథర్వా హీరోగా నటించిన 'హృదయం మురళి' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయనకు 'గద్దలకొండ గణేష్' తర్వాత ఎందుకు తెలుగు సినిమాలు చేయలేదు? అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి అథర్వా స్పందిస్తూ.. "గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాకు తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. నేను కూడా తెలుగు సినిమాలు చేయాలని అనుకున్నాను. అయితే అదే సమయంలో కరోనా రావడంతో నా షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది. అప్పటికే కొన్ని తమిళ చిత్రాలకు కమిట్ కావడంతో వాటినే పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే తెలుగులో సినిమాలు చేయలేకపోయాను" అని వెల్లడించారు.






