యూట్యూబర్ ప్రశ్న రావణ్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్! ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్

by Ramesh Naini |   (  Updated:2026-07-09 07:16:55  IST  )

విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో భాగంగా యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌కు చెందిన ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం.

యూట్యూబర్ ప్రశ్న రావణ్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్! ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో భాగంగా యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌కు చెందిన ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. గత రెండేళ్లుగా సామాజిక విద్వేషాన్ని రెచ్చగొట్టే వీడియోలను ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కాకినాడ పోలీసులు బ్యాంకులకు లేఖలు రాయగా, వాటి ఆధారంగా ఖాతాలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

ఆదాయం నెలకు రూ.1.50 లక్షలు..!

ప్రాథమిక విచారణలో వివాదాస్పద వీడియోల ద్వారా ఆయన నెలకు రూ.1.5 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే రావణ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఫోన్‌లోని వీడియోలు, తొలగించిన డేటా, వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తూ ఆయన వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

18 వరకు రిమాండ్..

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పలు కేసుల్లో అరెస్టైన రావణ్‌పై ‘ఉపా’ కింద కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల కోర్టు ఆయనకు ఈ నెల 18 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన యూట్యూబ్ ఛానల్‌లోని వేలాది వీడియోల్లో విద్వేషపూరిత అంశాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలియజేయగా, ఆ వీడియోలు ఏఐ సృష్టించివేనని రావణ్ తరఫు న్యాయవాది వాదించారు.

Next Story