- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమికుల కులాంతర వివాహం.. సినిమా రేంజ్‌లో వధువు కిడ్నాప్
కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న కక్షతో వధువును ఆమె కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లో నవ వధువు కిడ్నాప్ (Kidnap) అంటే.. టక్కున గుర్తుకొచ్చేవి సుమోలు, కార్లు, హెలికాప్టర్లే. భారీ ఛేజింగ్‌లు, ఫైట్లతో కథలు సుఖాంతం అవుతుంటాయి. కానీ, రియల్ లైఫ్‌లో కూడా సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా కులాంతర వివాహం చేసుకున్న ఓ నవ వధువును ఆమె కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేసిన ఘటన మెదక్ (Medak) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లాపూర్ (Ellapur) గ్రామానికి చెందిన ప్రణయ్ గత యువతిని ప్రేమించి ఈ నెల 6న కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే, ఆ పెళ్లి వధువు కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో వారంతా తమ అమ్మాయిని ఎలాగైనా కిడ్నాప్ చేసి ఇంటి తీసుకురావాలని బంధువులతో కలిసి పక్కా ప్లాన్ చేశారు. అనంతరం వరుడు ప్రణయ్ ఇంటిని నాలుగు కార్లలో వచ్చి సైలెంట్‌గా చుట్టుముట్టారు. వారితో గొడవకు దిగి.. బీభత్సం సృష్టించి బలవంతంగా ఇంట్లో చొరబడి వధువను తమ వెంట లాక్కెళ్లారు. ఈ క్రమంలోనే అడ్డొచ్చిన వరుడు ప్రణయ్, అతడి కుటుంబ సభ్యులు, స్థానికులను కారులో వధువును ఎత్తుకెళ్లారు.
పోలీసులపై ఆరోపణలు..
అయితే, సదరు ప్రేమికుల కులాంత వివాహానికి సంబంధించి అంతకుముందే పోలీస్ స్టేషన్ (Police Station)లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కానీ, ఆ మరుసటి రోజే వధువు తరఫు వారు వరుడి ఇంటి వచ్చి కిడ్నాప్‌నకు పాల్పడటం గమనార్హం. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని, తమకు రక్షణ కల్పించడంలో, వధువును రక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వరుడు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.






