ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం..

by Kodari Anjali |

శ్రీ బీరప్ప స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం గ్రామ ఉప సర్పంచ్ బైండ్ల రాములు రూ.50,000ల భారీ విరాళాన్ని అందజేశారు.

ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం..
X

దిశ, నవాబుపేట: మండలంలోని కూచూరు గ్రామంలో కురువ (కుర్వ) కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం గ్రామ ఉప సర్పంచ్ బైండ్ల రాములు రూ.50,000ల భారీ విరాళాన్ని అందజేసి తన భక్తి, సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కురుమ (కుర్వ) కుల పెద్దలు, యువకులు, భక్తులు ఆయనను ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూచూరు గ్రామంలో కురుమ (కుర్వ) కులస్తులు అధిక సంఖ్యలో నివసిస్తూ తరతరాలుగా శ్రీ బీరప్ప స్వామిని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు.

Next Story