రాజ్యసభలో BRS ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర: ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్

by Kema Shiva Kumar |

రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు.

రాజ్యసభలో BRS ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర: ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పార్లమెంట్‌లో భారత్ రాష్ట్ర సమితి (BRS) తమ పార్లమెంటరీ పార్టీ నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. రాజ్యసభలో బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా, పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra)ను నియమిస్తూ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో కొనసాగిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి (KR Suresh Reddy) పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో వద్దిరాజు రవిచంద్రను ఎన్నుకున్నట్లుగా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అధికారికంగా లేఖ రాశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇకపై రాజ్యసభలో బీఆర్‌ఎస్ పార్టీ తరపున వద్దిరాజు రవిచంద్ర ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించి పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించనున్నారు.

Next Story