మూసీ పునరుజ్జీవన పనులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-09 08:52:54  IST  )

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

మూసీ పునరుజ్జీవన పనులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవన పనులకు సంబంధించి తెలంగాణ సర్కార్ తొలి అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని ప్రయారిటీ స్ట్రెచెస్ అయిన జోన్-1A, జోన్-1B పరిధిలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ బడ్జెట్‌లో భూసేకరణ (Land Acquisition) ఖర్చులు మాత్రం చేర్చలేదు. జోన్ 1A పరిధిలో హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, జోన్ 1B పరిధిలోని ఉస్మాన్‌సాగర్ (గండిపేట) నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి పనులు. కొనసాగుతాయి.

ఏడీబీ నుంచి భారీ రుణం..

మూసీ పునరుజ్జీవానికి భారీ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం రెండు విధాలుగా సమర్చుకోనుంది. మొత్తం రూ.7,345.12 కోట్లలో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) నుంచి రూ.4,500 కోట్ల భారీ రుణాన్ని తీసుకోనున్నారు. మిగిలిన రూ.2,845.12 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంట్ రూపంలో భరించనుంది. ఈ ప్రాజెక్టు పనులను పూర్తిగా ఈపీసీ (EPC - Engineering, Procurement, and Construction) మోడ్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియాతో పాటు అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం తదుపరి చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హైదరాబాద్ రూపురేఖలను మార్చే మూసీ సుందరీకరణ పనులు త్వరలోనే మరింత వేగవంతం కానున్నాయి.




Next Story