'సర్ ' నమోదులో స్థానికేతర్లు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు

by velandi.Saikiran |

సర్ నమోదులో తమ పేరు కోల్పోతామని వలస వెళ్ళిన వాళ్ళు, స్థానికేతర్లు, ఆందోళ‌న చేయ‌వద్దని తహశీల్దార్ సతీష్ కుమార్ చెప్పారు.

సర్  నమోదులో స్థానికేతర్లు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు
X

దిశ, మక్తల్: సర్ నమోదులో తమ పేరు కోల్పోతామని వలస వెళ్ళిన వాళ్ళు, స్థానికేతర్లు, ఆందోళ‌న చేయ‌వద్దని తహశీల్దార్ సతీష్ కుమార్ చెప్పారు. ఆన్లైన్ లో పేరు నమోదు చేసుకుంటే బీఎల్ఓ లో ఖాతాలో నమోదు చేరుతుందని వివ‌రించారు. సంగం బండ, భూత్పూర్‌, జురాల సాగునీటి ప్రాజెక్టుల ముంపు గ్రామాల ప్రజలు, ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసం ఉంటున్నారు. అయితే, అలాంటి వాళ్లు స‌ర్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాల‌ని వెల్ల‌డించారు. స‌ర్‌ గడువు పెంచే విషయం ఇంకా క్లారిటీ రాలేదని, అది ఎన్నికల కమిషన్ పరిధిలో ఉందని వివ‌రించారు. మక్తల్ మండలంలో ఇప్పటివరకు దాదాపు మండలంలో ఉన్న 39 గ్రామాలలో అన్ని బూతుల వారిగా బిఎల్వోలు ఫారాలు అందజేశారన్నారు.

Next Story