ఆదివాసీ హక్కులను అమలు చేయాలి:-ప్రొఫెసర్ హరగోపాల్

by Taduka Kalyani |

ఆదివాసులకు చెందాల్సిన ఏ హక్కులైతే కల్పించారో, అమలు చేశారో వాటిని అమలు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.

ఆదివాసీ హక్కులను అమలు చేయాలి:-ప్రొఫెసర్ హరగోపాల్
X

దిశ,రాంనగర్ : ఆదివాసులకు చెందాల్సిన ఏ హక్కులైతే కల్పించారో, అమలు చేశారో వాటిని అమలు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్, ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద తుడుం దెబ్బ మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ఆదివాసి తెగలకు చెందవలసిన విద్య ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని అన్నారు. సామాజిక విద్య, ఆర్థిక పరిస్థితులపై స్వతంత్ర విచారణ జరపాలన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్, ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రవణ్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కొమురం భీం కాలనీ ప్రభుత్వ భూమిలో గత ౨౦ సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఆదివాసులకు ఇంటి స్థలాల పట్టాలు, మంచినీరు, విద్యుత్ విద్య వైద్యం రోడ్డు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆదివాసులకు ప్రత్యేక మతం కోడ్ (రిలీజియన్) కాలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అనురాధ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా నుంచి ఆదివాసి ఉద్యోగులు, విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story