- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలి: మునుగోడు ఎమ్మెల్యే
రానున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో శాలిగౌరారం మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

దిశ, శాలిగౌరారం: రానున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో శాలిగౌరారం మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హైదరాబాద్ లోని అయన నివాసంలో శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన చింత ధనుంజయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చింత ధనుంజయ్యను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల్లో మండలంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలనీ సూచించినట్టు ధనుంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ వైస్ చైర్మన్ చామల మహేందర్ రెడ్డి, నాయకులు వడ్లకొండ పరమేష్, జమ్ము అశోక్ తదితరులు పాల్గొన్నారు.






