- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటెపై పెళ్లికొడుకు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఒంటెపై పెళ్లికొడుకు ఊరేగింపు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, ఝరాసంగం: పెళ్లి ఊరేగింపుల్లో (బరాత్) డ్యాన్స్‌లు, వినూత్న వాహనాల ప్రదర్శనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం జొన్నాడ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ప్రశాంత్‌కు, మానూర్ మండలం దుద్దగొండ గ్రామానికి చెందిన శారద అనే యువతితో వివాహం జరిగింది. వివాహ వేడుకలో బంధువులు చేసిన వినూత్న ఏర్పాట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. హుమ్నాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వివాహంలో పెళ్లికొడుకును ఒంటెపై కూర్చోబెట్టి పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. అనంతరం బ్యాండ్ బాజాల నడుమ ఒంటెతో కలిసి పెళ్లికొడుకు, బంధువులు ఉత్సాహంగా డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఈ వేడుకలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు, స్నేహితులు ఒంటెపై కూర్చొని సందడి చేసిన దృశ్యాలను పలువురు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒంటె, గుర్రంపై పెళ్లికొడుకును పెళ్లి మండపానికి తీసుకురావడం ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్‌లో చాలా ప్రసిద్ధమైన ఆచారం. ప్రస్తుతం తెలంగాణకు సైతం పాకడం విశేషం.






