- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11.30 దాటినా ఖాళీ కుర్చీలే.. సమయపాలన మరిచిన అధికారులు
ప్రజలకు సేవలు అందించాల్సిన ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఉదయం 11.30 గంటలు దాటినా అధికారుల కుర్చీలు ఖాళీగానే దర్శనమిచ్చాయి.

దిశ, ఇల్లంతకుంట: ప్రజలకు సేవలు అందించాల్సిన ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఉదయం 11.30 గంటలు దాటినా అధికారుల కుర్చీలు ఖాళీగానే దర్శనమిచ్చాయి. ఎంపీడీఓ, ఎంపీఓ, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు విధులకు హాజరు కాకపోవడంతో పనుల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి చూసి నిరాశతో వెనుదిరిగారు. కార్యాలయంలో అటెండర్లు మాత్రమే కనిపించడంతో "ఆఫీసు అటెండర్లతోనే నడుస్తోందా?" అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయపాలన తప్పనిసరి అయినా, మండల పరిషత్ కార్యాలయంలో మాత్రం నిబంధనలు అమలు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షించే ఉన్నతాధికారుల లేమిని ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు జవాబుదారీతనం చూపాల్సిన అధికారులు కార్యాలయానికి సమయానికి రాకపోతే, సామాన్యుడి సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? ప్రజల సమయానికి విలువ లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సమయపాలన పాటించని అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేక ప్రజలను వేచి చూడడమే విధానంగా మారిందా? అనే ప్రశ్నలు మండల ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.






