- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హనుమకొండకు చేరుకున్నారు. హన్మకొండలోని ఎన్‌ఐటీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎన్ పిడిసిఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. హనుమకొండ కలెక్టరేట్లో గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించి అనంతరం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story






