- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో మేడం చాలాబాగా నటించారు..! సీపీ సుమతిపై నవీన్ పొలిశెట్టి షాకింగ్ కామెంట్స్
తాను నటించబోయే కొత్త మూవీలో ఫుల్ టైమ్ పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లుగా నటుడు నవీన్ పొలిశెట్టి ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: నవీన్ పొలిశెట్టి.. వినూత్నమైన సినిమాలు, తనకంటూ ఓ సపరేటు మ్యానరిజంతో యువతలో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అయితే, తాజాగా ఆయన మల్కాజ్‌గిరి ‘పోలీస్ గేమ్స్ మీట్’ వేడుకలకు చీఫ్ గెస్ట్ హాజరై సందడి చేశాడు. ఈ సందర్భంగా వేదికపై నవీన్ మాట్లాడుతూ.. త్వరలోనే తాను స్క్రీన్‌పై పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లుగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.
సీపీ సుమతికి బంపరాఫర్.. సజ్జనార్‌తో గన్ ట్రెయినింగ్
మల్కాజ్‌గిరి సీపీ సుమతితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ నవీన్ పొలిశెట్టి సరదగా కామెంట్ చేశారు. ఇటీవల మహిళా భద్రతపై దిల్‌సుఖ్‌నగర్‌లో ఆమె చేసిన అండర్ కవర్ ఆపరేషన్ వీడియోను ప్రశంసిస్తూ.. ‘మేడమ్ చాలా బాగా నటించారు.. మా సినిమాలో కూడా ఓ రోల్ చేయండి’ రిక్వెస్ట్ చేశారు. ఇక హైదరాబాద్ సీపీ సజ్జనార్ వైపు తిరిగి.. ‘సార్, నాకు సినిమాలో గన్ ఎలా పట్టుకోవాలో కాస్త నేర్పించండి’ అని నవీన్ పొలిశెట్టి కోరారు. ఇంతలోనే డీజీపీ సీవీ ఆనంద్ జోక్యం చేసుకుని.. ‘గన్ ట్రైనింగ్ ఓకే కానీ.. ఒరిజినల్ బుల్లెట్లతో కాదు సుమా!’ అంటూ సరదాగా ఛలోక్తులు విసిరారు. అందుకు నవీన్ పొలిశెట్టి మళ్లీ రియాక్ట్ అవుతూ.. ‘మా సినిమాల్లో అన్నీ ఫేక్ బుల్లెట్లే ఉంటాయి సార్.. అయినా నాకు కనీసం గన్ ఎత్తడం కూడా రాదు’ అని అమాయకంగా అనడంతో అక్కడున్న పోలీస్ అధికారులందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రస్తుతం అందుక సంబంధించి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.






