నిద్రమత్తులో సెంటర్ డివైడర్‌ను ఢీకొట్టిన లారీ..

by Kodari Anjali |

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ సెంట్రల్ డివైడర్‌ను ఢీకొట్టింది.

నిద్రమత్తులో సెంటర్ డివైడర్‌ను ఢీకొట్టిన లారీ..
X

దిశ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ సెంట్రల్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, AP 39 WB 8189 నంబర్ గల 12 టైర్ల లారీ నాగపూర్ నుంచి విజయవాడకు వెళ్తుండగా గురువారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రంతా ప్రయాణం చేసిన డ్రైవర్ నిద్రమత్తుకు లోనవడంతో పాటు ఉదయం కురిసిన వర్షం కారణంగా వాహనం అదుపుతప్పి యూనియన్ బ్యాంక్ ఎదుట ఉన్న సెంట్రల్ డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో డ్రైవర్ రఫీ, క్లీనర్ ప్రసాద్ ఉన్నారు. లారీలో పెయింట్ తయారీకి సంబంధించిన కెమికల్ పౌడర్ లోడ్ ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పాదచారులు లేదా ఇతర వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. వాహనదారులు నిద్రమత్తులో డ్రైవింగ్ చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచించారు.

Next Story