- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో నెత్తురోడిన కల్యాణ మండపం.. దారుణమైన జంట హత్యలు
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయబడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయబడ్డారు. మృతులను మునిరత్నం (50), మణికంఠ (42)గా పోలీసులు గుర్తించారు.
కుటుంబ కలహాలే కారణం..
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్ వివాహం చేసుకున్నాడు. అయితే, కొద్ది నెలల క్రితం ఎలాంటి కారణం లేకుండా భార్యను సునీల్ వదిలేశాడు. పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతున్న వేరొక వివాహ వేడుకకు సునీల్ వస్తున్నాడని తెలుసుకున్న సంపూర్ణమ్మ.. తన కుమార్తె పెళ్లికి పెద్దలుగా వ్యవహరించిన మునిరత్నం, మణికంఠలకు సమాచారం అందించారు.
కత్తులతో విచక్షణారహితంగా దాడి
వెంటనే కల్యాణ మండపానికి చేరుకున్న మునిరత్నం, మణికంఠలు భార్యను ఎందుకు వదిలేశావు అంటూ సునీల్‌ను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న సునీల్ తమ్ముడు, అక్క, మరో బంధువు కలిసి మునిరత్నం, మణికంఠలపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
పరారీలో నిందితులు
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రక్తపు మడుగులో ఉన్న మణికంఠను రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ జంట హత్యలతో పెళ్లికి వచ్చిన వారంతా తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సునీల్, అతడి కుటుంబ సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.






