- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త వేధింపులు తాళలేక కడతేర్చిన భార్య..
by Kodari Anjali |
భర్త వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తను కడతేర్చిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కలకలం రేపుతుంది.

X
దిశ, కోరుట్ల: భర్త వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తను కడతేర్చిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కలకలం రేపుతుంది. పట్టణ ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని అల్లమ్మయ్యగుట్ట కాలనీలో నివాసం ఉంటున్న ఇప్ప కాశీరాము, రజని అనే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని అదే క్రమంలో గురువారం తెల్లవారుజామున భర్త కాశీరం భార్యపై మరోసారి గొడవకు దిగాడు. సహనం కోల్పోయిన భార్య గురువారం తెల్లవారుజామున భర్త కాశీరంను రోకలి బండతో తలపై కొట్టాడు. మృతుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న కోరుట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






