- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైదాబాద్‌లో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ ప్రాంతంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది.

దిశ, చంపాపేట్: నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ ప్రాంతంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, రద్దీగా ఉండే సైదాబాద్ ప్రధాన రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మాదన్నపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి పేరు, చిరునామా, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండటం, రహదారి అధ్వాన్నంగా మారడం, సరైన ట్రాఫిక్ మళ్లింపు చర్యలు లేకపోవడం కూడా కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారడంతో పాటు నిత్యం భారీ వాహనాల రాకపోకలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ, సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రహదారిని సురక్షితంగా తీర్చిదిద్దాలని, ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్ఠం చేసి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత శాఖలను కోరారు.






