భవనం 5వ అంతస్తు నుండి జారిపడిన బాలుడు.. పునర్జన్మనిచ్చిన రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు

by Kodari Anjali |   (  Updated:2026-07-09 06:35:42  IST  )

బతుకుతాడనే ఆశలేని బాలుడిని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రాణం పోసింది.

భవనం 5వ అంతస్తు నుండి జారిపడిన బాలుడు.. పునర్జన్మనిచ్చిన రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు
X

దిశ, బంజారాహిల్స్/హైదరాబాద్: ప్రమాదవశాత్తు భవనం నుండి జారిపడిన 13 ఏళ్ల బాలుడిని ముందుగా నిజాంపేట సమీపంలోని ఒక హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వారు అక్కడ బాలునికి వెంటిలేటర్ అమర్చి మెరుగైన చికిత్స కొరకు కూకట్ పల్లి - రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు. బాలుడు తీవ్రంగా రక్తం కారిపోయి, బి.పి.బాగా తగ్గిపోయి షాక్‌లో ఉన్నాడు. వెంటనే పీడియాట్రిక్ ఐసియు వైద్య బృందం పరిస్థితిని నియంత్రించుటకు అనేక లీటర్ల సెలైన్, రక్తం ఉత్పత్తులు ఎక్కిస్తూనే, ప్రాణాంతకమైన ఇతర గాయాలకు చికిత్స అందించి, నిరంతర ఐసియు సేవలు, మరింత మెరుగైన వైద్య సహాయం కొరకు బాలుడి రెయిన్‌బో బంజారా హిల్స్‌కు బంజారా హిల్స్‌కు తరలించారు. ఇలాంటి కేసులను ఒక్క స్పెషాలిటీ మాత్రమే నిర్వహించలేదని కార్డియాలజీ, ఇంటెన్సివ్ కేర్, సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ, అనేక ఇతర బృందాలు పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్, పీడియాట్రిక్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, క్రిటికల్ కేర్ నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌ల సహకారం అవసరమైంది. అన్నారు. అసాధారణమైన పీడియాట్రిక్ ట్రామా రికవరీలలో ఒకటిగా అభివర్ణించిన ఒక ఘటనలో, పిల్లలలో అరుదుగా ఒకేసారి కనిపించే తీవ్రమైన గాయాల కలయిక నుండి 13 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ బాలుని శరీరంలోని బృహద్ధమనికి ప్రాణాంతకమైన రీతిలో గాయం కావటం, మెదడు గాయం, క్లోమగ్రంథి గాయం, మూత్రపిండాల వైఫల్యం, తొడ ఎముక విరగడం, తీవ్రమైన తల గాయం, ప్యాంక్రియాటిక్ గాయం, రెండు ఊపిరితిత్తులకు గాయం వంటి పలు అవయవ వైఫల్యతలు గుర్తించారు.

గాయం వంటివి ఒక్కొక్కటిగా నయం చేస్తూ..

అధునాతన ఇమేజింగ్, బెడ్‌సైడ్ ఎకోకార్డియోగ్రఫీలో థొరాసిక్ అయోర్టాకు గాయం అయినట్లు కనుగొన్నారు. అయోర్టాకు కలిగే గాయం ప్రాణంతకమైనదని,సాధారణంగా ఇటువంటి పేషెంట్లు అంతర్జాతీయ నివేదిక ప్రకారం 80-90% మంది రోగులు ఆసుపత్రికి వచ్చేలోపే మరణిస్తారని 50% మంది గాయం అయిన మొదటి 24 గంటల్లోనే మరణిస్తారని, చికిత్స చేయకపోతే అధిక రక్తస్రావంతో మరణించవచ్చునని వైద్యులు పేర్కొన్నారు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU) బృందం, కార్డియాలజీ బృందం, న్యూరోఇమేజింగ్ మరియు అధునాతన న్యూరో-ఇంటెన్సివ్ కేర్ పర్యవేక్షణలో అయోర్టిక్ స్టెంటింగ్ విజయవంతం కావడం, దానితో పాటుగా ఇతర ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల గాయం, ప్యాంక్రియాటిక్ గాయం, కుడి తొడ ఎముక విరగడం, మూత్రపిండాల గాయం వంటివి ఒక్కొక్కటిగా నయం చేస్తూ రావటంతో హాస్పిటల్ లో చేరిన రెండవ వారంలో క్రమంగా కోమా నుండి కోలుకోవడంతో వెంటిలేషన్ తొలగించి, ఆబాలుని మెదడు పనితీరు అంచనా వేయడం వైద్య బృందానికి ఒక సవాలుగా మారింది. మెదడును రక్షించే న్యూరో ఇంటెన్సివ్ కేర్ పర్యవేక్షణ, మద్దతు అందించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. "ఆ బాలుడు హాస్పిటల్ కు వచ్చినప్పుడు ప్రధాన అవయవ వ్యవస్థ దెబ్బతిని ఉన్నాది. ఒక గాయానికి చికిత్స చేయడంపై కాకుండా ప్రతి అవయవం పనిచేసేలా చూడటంపై మేము దృష్టి పెట్టాము.

ఎండోవాస్కులర్ స్టెంట్ ప్రక్రియ ద్వారా...

జీర్ణాశయాంతర రక్తస్రావం నుండి సెప్టిక్ షాక్ వరకు సుదీర్ఘకాలం మెకానికల్ వెంటిలేషన్, డయాలసిస్, ఇంటెన్సివ్ పర్యవేక్షణ, పదేపదే వైద్య పర్యవేక్షణ అవసరమయ్యాయి. మా బహుళ-విభాగాల బృందం సమిష్టి సేవలు రేయింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేసిన మా ఐసీయూ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, నిపుణుల అంకితభావం, ఆ బిడ్డ కోలుకోవడంలో కీలక పాత్ర పోషించాయి" అన్నారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ సీనియర్ కన్సల్టెంట్ – పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ మరియు పీడియాట్రిషియన్ డాక్టర్ అనుపమ వై. రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రావు కోనేటి మాట్లాడుతూ, "ఈ కేసులో థొరాసిక్ అయోర్టిక్ గాయం అత్యంత క్లిష్టమైన అంశాలలో ఒకటని.. వీటికి తక్షణ చికిత్స అవసరమని కొద్దిపాటి ఆలస్యం ప్రాణాంతకం కావచ్చు అన్నారు. ఎండోవాస్కులర్ స్టెంట్ ప్రక్రియ ద్వారా దెబ్బతిన్న రక్తనాళాన్ని సవరించటం వల్ల ఇంటెన్సివ్ కేర్ బృందం ఇతర గాయాలను నయంచేయటంపైన దృష్టి పెట్టగలిగింది. ఆ బాలుడు పూర్తి ఆరోగ్యంతో 5 వారాల తర్వాత హాస్పటల్ నుండి ఇంటికి వెళ్లాడు. విరిగిన తోడ ఎముకలు నయం కావటానికి కొంత బెడ్ రెస్ట్ అవసరమని చెప్పటం జరిగింది. డిశ్చార్జ్ అయిన కొన్ని వారాల తర్వాత ఆ బాలుడు నవ్వుతున్న యువ కళాకారుడిగా హాస్పిటల్‌కు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనను జాగ్రత్తగా కాపాడిన వైద్య బృందానికి కృతజ్ఞతగా తన కళాకృతులలో ఒకదానిని ప్రశంసా చిహ్నంగా బహుకరించాడు.

Next Story