- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తార్నాకలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం
by Kodari Anjali |
లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తార్నాక శ్మశానవాటిక సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

X
దిశ, సికింద్రాబాద్: లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తార్నాక శ్మశానవాటిక సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం, ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి లాలాపేట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే మృతుడి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






