న్యూస్ పేపర్ ఫస్ట్ పేజీపై ‘రక్తం మరక’.. నెట్టింట్లో సౌతాఫ్రికా పేపర్ యాడ్ వైరల్‌

by Kema Shiva Kumar |

సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘ది స్టార్’ పత్రిక మొదటి పేజీలో ముద్రించిన ఓ నకిలీ రక్తం మరక ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది.

న్యూస్ పేపర్ ఫస్ట్ పేజీపై ‘రక్తం మరక’.. నెట్టింట్లో సౌతాఫ్రికా పేపర్ యాడ్ వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూస్ పేపర్‌లో ఫస్ట్ పేజీపై ఓ పెద్ద రక్తపు మరక. ఓ స్పోర్ట్స్ ఆర్టికల్‌పై ఆ రక్తం మరకలు పడి, పేజీల వెనుక వైపు ఉన్న పేజీలకు కూడా అంటినట్లుగా కనిపించింది. అయితే, మొదట ఇది చూసిన రెగ్యులర్ రీడర్స్ అంతా ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చిన, ఇంక్ ఒలికి పేపర్ పాడైపోయిందని అనుకున్నారు. కానీ తీరా లోతుగా పరిశీలిస్తే.. అది ప్రింటింగ్ తప్పు కాదు, సమాజంలో నెలకొన్న ఓ పెద్ద మూఢనమ్మకంపై చర్చను లేవనెత్తేందుకు చేసిన ఓ వినూత్న ప్రకటన అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ వార్తాపత్రిక ‘ది స్టార్’ (The Star) ఫస్ట్‌ పేజీలో ఆ ప్రకటన ప్రింట్ అయింది. ఆ రక్తం మరక కింద ఒక చిన్న లైన్ రాసి ఉంది. ‘ఒకవేళ మీ ప్యాడ్ (Pad) ఐదేళ్ల పాటు మన్నికగా ఉంటే ఎలా ఉంటుంది? కాగా, ఆఫ్రికాలోనే ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేసే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ‘మెన్‌స్ట్రూయేషన్ ఫౌండేషన్’ (Menstruation Foundation) ఈ వినూత్న ప్రకటనను రూపొందించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఋతుస్రావం సమయంలో బట్టలపై మరకలు పడతాయేమోనని పడే ఆందోళనను, ఆ సమయంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టేలా ఈ ప్రకటనను డిజైన్ చేశారు. పీరియడ్స్ అనేవి సర్వసాధరణమైనప్పటికీ, దానిని తప్పుగా చూస్తూ సమాజంలో ఉన్న సిగ్గు, అపోహలను తొలగించడమే ఈ యాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఈ పేపర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. డిజిటల్ ప్రకటనల యుగంలోనూ ప్రింట్ మీడియా ద్వారా ఎంతో క్రియేటివిటీతో సమాజంలో అన్ని విషయాలపై అవగాహన తీసుకురావచ్చని నెటిజన్లు ఈ యాడ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story