- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: బిహార్ ఎన్నికల ఎఫెక్ట్.. పాట్నా ఎయిర్‌పోర్టులో బారులు తీరిన హెలికాప్టర్లు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections)ను అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections)ను అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇవాళ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండో దశ పోలింగ్ సందర్భంగా పార్టీ ప్రచారం నవంబర్ 9తో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అగ్ర నేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో జోరుగా పాల్గొంటున్నారు. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు సమయం పడుతుందని.. ఏకంగా హెలికాప్టర్లలో ప్రచారానికి వెళ్తున్నారు. దీంతో పాట్నా (Patna)లోని జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ స్ట్రిప్ పొడవునా హెలికాప్టర్‌లు పార్క్ చేసి ఉన్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ‘బిహార్ ఎన్నికల కోసం పట్నా ఎయిర్‌పోర్టులో లైన్‌లో నిలిచిన హెలికాప్టర్లు ఇవి.. భారత్ పేద దేశం కాదు సుమా’ అనే ట్యాగ్ లైన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.






