- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: కొయ్యలగూడెంలో అద్భుతం ఆవిష్కృతం.. పొలంలో పురాతన శివలింగం ప్రత్యక్షం!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో అద్భుతం చోటుచేసుకుంది. రైతు పొలంలోని బావి వద్ద రాత్రికి రాత్రే పురాతన శివలింగం ప్రత్యక్షమవడంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండల పరిధిలోని కొయ్యలగూడెం (Koyyalagudem) గ్రామ శివారులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని జంగం సురేష్ రెడ్డి అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద సోమవారం ఉదయం ఓ పురాతన శివలింగం కనిపించింది. రాత్రికి రాత్రే ఈ శివలింగం అక్కడ వెలవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఆ పురాతన శివలింగం (Ancient Shiva Lingam) అసలు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి బయటపడిందా లేక గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా తెచ్చి ఇక్కడ వదిలి వెళ్లారా? అనే అంశంపై గ్రామస్థుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో శివలింగాన్ని చూసేందుకు తరలివస్తున్నారు.
మేళతాళాలతో గ్రామంలోకి..
హఠాత్తుగా తమ గ్రామ పొలిమేరల్లో శివలింగం ప్రత్యక్షం కావడం శుభసూచకమని గ్రామస్థులు భావిస్తున్నారు. ఆ పరమశివుడే తమ గ్రామానికి వచ్చాడని నమ్ముతూ.. భక్తి పారవశ్యంతో ఆ శివలింగాన్ని మేళతాళాలు, మంగళహారతులతో గ్రామంలోని రామాలయానికి (Ramalayam) తరలించారు. అనాదిగా తమ గ్రామంపై దైవకృప ఉందని, ఈ శివలింగం లభించడం తమ అదృష్టమని గ్రామ పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పురాతన శివలింగం ఏ కాలానికి చెందిందనే విషయంపై పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో స్థానికులు ఉన్నారు.






